ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలం గన్నారం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మరియు జక్రాన్ పల్లి మండలం నారాయణపేట గ్రామంలో పసుపు దిగుబడులు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తోపాటు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, మార్క్ ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి హాజరయ్యారు.
అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… పప్పుశనగ, పొద్దుతిరుగుడు రైతులు ఆందోళన చెద్దొద్దని సంబంధిత రైతుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పంటలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకెళ్తుందన్నారు. పప్పుశనగ, పొద్దతిరుగుడు రైతులు అతిత్వరలోనే ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయాన్ని వింటారన్నారు.
పప్పుశనగ 1,89,000 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుంది. కాగా కేంద్రం 47600 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అనుమతించిందన్నారు. మరొవైపు పొద్దతిరుగుడు 7000 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఉండగా కేంద్రం కేవలం 1,700 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు మాత్రమే అవకాశం ఇచ్చిందన్నారు. కాగా జొన్నల కొనుగోలుకు అసలు అనుమతే ఇవ్వలేదన్నారు.
రాష్ట్ర పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తే సంతోషం. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులెవరూ ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకురావొద్దన్నారు. కరోనా వైరస్ ప్రబలకుండా మార్కెటింగ్ శాఖ ద్వారా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కూపన్ల ప్రకారం కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పసుపు రైతుల సమస్యల మీద నిపుణుల కమిటీ వేశాం.. రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలు అన్వేషిస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి