త్వరలో పదోన్నతులు:హరీశ్‌

115
- Advertisement -

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలకు పట్టువిడుపులు ఉండాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు.  అంతేకాదు త్వరలోనే పదోన్నతులకు క్లియరెన్స్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్స్‌లో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం వ్యవసాయ డైరీని క్యాలెండర్‌ను హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…రాష్ట్రంలో ఉద్యోగుల పదోన్నతులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయం రంగంలో గణనీయమైన మార్పులు తేవడానికి వ్యవసాయాధికారులు ప్రధాన కారణమని తెలిపారు. వారి సలహాలు సూచనలు ఆధారంగా వచ్చినవే ఈ వ్యవసాయ పథకాలని మంత్రి తెలిపారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత 9మంది ఉన్న జిల్లా వ్యవసాయ అధికారులు ఇప్పుడు 32మంది ఉన్నారని అన్నారు. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నులున్న వరి ధాన్యం ఉత్పత్తి 2022 నాటికి 2.49 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరింద‌ని గుర్తు చేశారు. ప్రపంచంలో నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమచేస్తున్న ఏకైక పథకం రైతు బంధు .. ఇప్పటి వరకు రూ.65 వేల కోట్లు జమ చేశామ‌ని తెలిపారు. కాళేశ్వరంతో భీడు భూములను సస్యశ్యామలం చేశాం. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయడంతో చెరువుల కింద 25 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. భూగర్భ జలాలు తెలంగాణ వ్యాప్తంగా పెరిగాయ‌ని తెలిపారు.

ఇవి కూడా చదవండి…

రేవంత్‌రెడ్డి కి బిగ్‌ షాక్‌

బాలయ్య అన్‌స్టాపబుల్‌కు కేటీఆర్‌, రాంచరణ్‌?

ప్లాస్టిక్‌ కవర్‌ లో వంట గ్యాస్

- Advertisement -