ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చాం:ఏపీ గవర్నర్

277
bishwa bhushan
- Advertisement -

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు గవర్నర్ బిశ్వ భూషణ్. ఏపీ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించిన గవర్నర్…వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ది సాధించామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని 40 అంశాలను అమలు చేశామని తెలిపారు. పారిశ్రామిక రంగంలో 5 వాతం వృద్ధి సాధించామన్నారు. 129 హామీల్లో 77 నెరవేర్చామని వెల్లడించారు.

గతేడాదితో పోలిస్తే తలసరి ఆదాయంలో 12 శాతం వృద్ధి సాధించామన్నారు.ఏడాదిలో వివిధ పధకాల ద్వారా 3.95 కోట్ల మంది లబ్ది పొందారని ఇందుకోసం రూ. 42 వేల కోట్లు ఖర్చుచేశామన్నారు.పిల్లల చదువు, తల్లుల సంక్షేమం కోసం అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని….నాడు- నేడు మనబడి కార్యక్రమం ద్వారా మూడేళ్లలో 48వేల పాఠశాలలను ఆదునీకరిస్తామని చెప్పారు.

ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 6.25 లక్షల మందికి లబ్ది చేకూరిందని చెప్పారు. దీనికోసం రూ.1534 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. విద్యార్ధులకు పౌష్టికాహారం కోసం జగనన్న గోరుముద్ద పథకం ప్రారంభించామన్నారు. గోరుముద్ద పథకం కోసం రూ.1105 కోట్లు ఖర్చు చేశామన్నారు. జగన్న వసతి దీవెన 18.51 కోట్ల మందికి లబ్ది చేకూరగా రూ.3857 కోట్లు కేటాయించామన్నారు. వైఎస్సాఆర్ ఆసరా కోసం రూ. 72 కోట్లు,వైఎస్సార్ కంటి వెలుగు కోసం రూ.53.85 కోట్లు ఖర్చు చేశామన్నారు.

గ్రామ సచివాలయాల్లో 12 వేల వైఎస్సాఆర్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. 1060 కొత్త 104,108 వాహనాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నాడు నేడు కింద ఆస్పత్రుల ఆధునీకరణకు రూ. 15 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

- Advertisement -