ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కరోనా ఉధృతి- ఆరెస్సెస్ చీఫ్

41

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ రావడానికి ప్రభుత్వ, ప్రజల నిర్లక్ష్యమే కారణమని మోహన్ భాగవత్ అన్నారు. ‘పాజిటివిటీ అన్‌లిమిటెడ్’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కరోనా మొదటి ఉద్ధృతి తర్వాత ప్రజలు, ప్రభుత్వాల్లో నిర్లక్ష్యం పెరిగిపోయిందని, ప్రస్తుత పరిస్థితికి అదే కారణమని అన్నారు.

కరోనా సెకండ్ వేవ్ రాబోతోందని మనకు తెలుసని, మరోవైపు వైద్యులు కూడా హెచ్చరించారని, అయినప్పటికీ మనం నిర్లక్ష్యాన్ని వీడలేదన్నారు.ప్రస్తుత పరిస్థితికి ఒకరినొకరు నిందించుకోవడం మాని పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారిపై పోరు విషయంలో ప్రభుత్వం మరింత పారదర్శకంగా వ్యవహరించాలని ఆరెస్సెస్ సీనియర్ నేత, బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పేర్కొన్నారు.