Congress:ఎన్నికల వేళ మరో షాక్..

38
- Advertisement -

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వల్లభ్.. ప్రస్తుతం పార్టీ ఏ దిశకు వెళ్తుంతో కూడా తెలియడం లేదని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ దెబ్బతిందని.. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తాను నినాదాలు చేయలేనని స్పష్టం చేశారు. సంపద సృష్టికర్తలను నిందించలేనని.. పార్టీలో అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.

కిందిస్థాయిలోని వారు తమ నాయకులకు నేరుగా సలహాలు ఇవ్వలేనప్పుడు ఎటువంటి సానుకూల మార్పు సాధ్యంకాదన్నారు. 2019లో జంషెడ్‌పూర్‌లో ఓటమి చెందిన గౌరవ్..ఆ తర్వాత 2023లో జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.

Also Read:KTR:సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగలేఖ

- Advertisement -