భారీగా తగ్గిన బంగారం ధరలు…

139
gold

బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 450 తగ్గి రూ.45, 000 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 49, 580 కి చేరింది.

బంగారం ధర తగ్గితే వెండిధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర రూ.64, 700 కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం దీనికి ఒక కారణమైతే, కోవిడ్ వ్యాక్సిన్‌ అనౌన్స్‌మెంట్ తర్వాత ప్రపంచ మార్కెట్లు తిరిగి కోలుకోవడం మరొక కారణం అని నిపుణులు చెబుతున్నారు.