పెరిగిన బంగారం ధరలు…

152
gold

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.48,880కి చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.44,800కు చేరింది. బంగారం ధరలు పెరుగగా వెండి ధరలు తగ్గాయి. కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ.71,400కి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 0.91 శాతం పెరగడంతో పసిడి రేటు ఔన్స్‌కు 1816 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా ఔన్స్‌కు 1.41 శాతం పెరగడంతో 25.22 డాలర్లకు పెరిగింది.