- Advertisement -
పసిడి ధర మళ్ళీ కొండెక్కింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు, దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో మళ్లీ రూ.30వేల మార్క్‌ను టచ్ చేసి, మూడు వారాల గరిష్ఠానికి చేరింది బంగారం ధర. ఇక (బుధవారం) నేడు మార్కెట్లో రూ.100 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.30,075గా ఉంది.
అంతర్జాతీయంగానూ 0.14శాతం పెరిగిన బంగారం.. సింగపూర్ మార్కెట్లో ఔన్సు ధర 1,284.80 అమెరికన్ డాలర్లు పలికింది. ఇక వెండి కూడా నేడు బంగారం బాటే పట్టింది. రూ.380 పెరగడంతో కిలో వెండి ధర రూ.39,250గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఎక్కువవడంతో ధర పెరిగినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.
- Advertisement -