ఛలో..న్యూయర్ ఇయర్ ట్రీట్

234
Chalo Movie New Year Gift
- Advertisement -

ఊహ‌లు గుస‌గుస‌లాడే ,  దిక్కులు చూడ‌కు రామ‌య్య‌ ,  ల‌క్ష్మిరావే మా ఇంటికి , క‌ళ్యాణ‌ వైభోగం ,  జ్యో అచ్యుతానంద  లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో… ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు నాగ‌శౌర్య. త్రివిక్రమ్ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన వెంకి కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఛలో.

శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు, ఫస్ట్ సాంగ్ కు అద్భుతమైన స్పందన లభించింది.  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న  ఈ సినిమా 2018, ఫిబ్రవరి 2న  ప్రేక్షకుల ముందుకురానుంది.

Physics Posternew
నూతన సంవత్సర కానుకగా సినిమాలోని రెండో సాంగ్‌ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.  భాస్క‌ర భ‌ట్ల సాహిత్యంతో ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రంలోని ఫస్ట్‌ సాంగ్ ‘చూసీ చూడంగానే’ అందరిని ఆకట్టుకుంది. ఈ పాట‌లోని విజువ‌ల్స్ కుర్ర‌కారుని అల‌రించేలా ఉన్నాయి. రెండోపాటను సైతం కుర్రకారుని అలరించేలా జోష్‌ ఉండే పాటను విడుదల చేయనున్నారట.

నటీనటులు – నాగశౌర్య, రష్మిక మండన్న, నరేష్, పోసాని, రఘు బాబు, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, ప్రవీణ్, సత్య, వైవా హర్ష, వేణు గోపాల రావు, మెట్ట రాజేంద్రన్, ప్రగతి, స్వప్ని, సుదర్శన్, జీవా తదితరులు.సాంకేతిక నిపుణులు- పాటలు – భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్,డ్యాన్స్ – రఘు, విజయ్,పి.ఆర్.ఓ – ఏలూరు శ్రీను,పబ్లిసిటీ డిజైన్స్ – అనిల్ భాను,ఫైట్స్ – వెంకట్,ఆర్ట్ – రామ్ అరసవిల్లి,లైన్ ప్రొడ్యూసర్ – బుజ్జి,ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), తమ్మిరాజు,సంగీతం- మహతి స్వర సాగర్ ,సినిమాటోగ్ర‌ఫి- సాయి శ్రీరామ్‌,నిర్మాత‌- ఉషా ముల్పూరి,సమర్పణ – శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి, ద‌ర్శ‌క‌త్వం- వెంకి కుడుముల‌.

- Advertisement -