దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ పట్టగా తాజాగా గోవాలో నేటి నుండి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి మే 3వ తేదీ ఉదయం వరకు లాక్‌డౌన్ అమలు చేయనున్నారు. అత్యవసర సేవలు, వివిధ పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. క్యాషినోలు, హోటళ్లు, పబ్‌లు మూసే ఉంటాయని చెప్పారు.
పెరుగుతున్న కొవిడ్ కేసులను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మే 7వ తేదీ వరకు కర్ఫ్యూను పొడగించింది. ప్రస్తుతం భోపాల్, ఇండోర్‌తో పాటు ప్రముఖ నగరాలు సహా పలు జిల్లాల్లో కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది.
ఇండోర్, భోపాల్, గ్వాలియర్, జబల్‌పూర్, ఉజ్జయిని సహా కొన్ని జిల్లాల్లో విస్తరిస్తున్న వైరస్ ఆందోళన కలిగిస్తోందని, పరిస్థితిపై శివరాజ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.