మొక్కలు నాటిన ‌కీసర సర్పంచ్ మాధురి వెంకటేష్

30
gic

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తన పుట్టినరోజును సందర్భంగా కీసర గ్రామం లోని రామాలయంలో రావి మొక్కలు నాటారు సర్పంచ్ మాధురి వెంకటేష్.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు మా కీసరగుట్టలో అడవి ని దత్తత తీసుకొని దాని అభివృద్ధి చేయడం జరుగుతుందని అలాంటి దానిలో నేను భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ రోజు నా పుట్టినరోజు పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.