గుజ‌రాత్‌లో కాంగ్రెస్ మేథోమధనం

21
- Advertisement -

64 సంవత్సరాల తర్వాత గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ మేథోమధనం ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు మేథోమధనం జరగనుండగా ఈ సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ , రాహుల్ గాంధీ , ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు రాబోయే ఎన్నికలు, పార్టీ పునరుజ్జీనం కోసం అవసరమైన రోడ్ మ్యాప్‌పై చర్చించి కార్యాచరణ, తీర్మానాలు చేసే అవకాశం ఉంది. అలాగే ఇతర పార్టీలతో పొత్తులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ప్రధానంగా ఈ ఏడాది చివరిలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు, 2026లో తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి 40 మంది నేతలు హాజరయ్యారు.

Also Read:కేసులకు భయపడేది లేదు!

- Advertisement -