జీహెచ్‌ఎంసీ రోడ్లు, మూసి డెవలప్ మెంట్, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమాల మీద మంత్రి కెటి రామారావు సమావేశం నిర్వహించారు. ఈ రోజు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హెచ్‌ఏండీఏ, జీహెచ్‌ఎంసీ , హైదరాబాద్ రొడ్డు డెవలప్ మెంట్ కార్పోరేషన్ అధికారులు పాల్గోన్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారులు రోడ్ల మరమత్తు కార్యక్రమాల్లో పాల్గోనాలని అదేశించారు. ఈ మేరకు వచ్చే మూడు నెలల పాటు అధికారులంతా సాద్యమైనంత ఎక్కువ సమయం ఈ మరమత్తులకు కేటాయించాలని కోరారు.
నూతనంగా నిర్మించబోయే ఫ్లై ఒవర్లు, స్కై వేల నిర్మాణాల్లో బిటి రోడ్ల బదులు పూర్తిగా సిమెంట్ రోడ్లు వేయాలని, దీంతో కనీసం దశాబ్ద కాలంపాటు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నారు. ఈ సూచన నేపథ్యంతో ప్రాజెక్టులకు అయ్యే అదనపు వ్యయంపైన నివేదిక తయారు చేయాలన్నారు.
హైదరాబాద్ రొడ్డు డెవలప్ మెంట్ కార్పోరేషన్ పైన మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న రోడ్ల తాలుకు డీపీఆర్ తయారీకి ఒక్క కన్సల్టెంట్ తో మాత్రమే కాకుండా సాద్యమైనంత ఎక్కవ మందికి అధిక కన్సల్టెంట్లతో పనిని త్వరగా పూర్తి చేయాలన్నారు.ఈ మేరకు ఈ నెల 22న జరిగే ప్రీడ్ సమావేశానికి అనుభవం, పేరు ఉన్న కంపెనీలకు మాత్రమే అహ్వానాలు పంపాలన్నారు. సాద్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మూసీ నది సుందరీకరణ పనులపైన కన్సల్టెంట్లతో మంత్రి ప్రణాళికలపైన చర్చించారు. రాజస్ధాన్ లోని అమానీష నాలా అభివృద్ది విజయవంతంగా పూర్తియిందని, ఈ ప్రాజెక్టులో ఏదురైన అనుభవాల అధారంగ మూసీ అభివృద్ది పనులకు అడ్డంకులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.