ప్ర‌ధాని నుంచి న‌గ‌దు పుర‌స్కారాన్ని స్వీక‌రించిన మేయ‌ర్, క‌మిష‌న‌ర్..

175
mayor, comisionr

భాగ్య‌న‌గ‌రానికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ అభివృద్దికి గాను బాండ్ల రూపంలో నిధుల‌ను సేక‌రించినందుకుగాను ప్రోత్సాహ‌కంగా రూ. 26కోట్ల చెక్కును అందుకున్నారు హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, న‌గ‌ర క‌మీష‌న‌ర్ జ‌నార్ధ‌న్ రెడ్డి. ప్ర‌ధాని మంత్రి నరేంద్ర‌మోడీ చేతుల మీదుగా ఈఅవార్డును అందుకున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అయిన‌టువంటి ల‌క్నోలో జ‌రిగిన ట్రాన్స్ ఫార్మింగ్ అర్బ‌న్ ల్యాండ్ స్కేపింగ్ స‌ద‌స్సు ముగింపు కార్య‌క్ర‌మం స‌మావేశంలో ప్ర‌ధాని మోడీ ఈచెక్కును అందజేశారు.

బాండ్ల రూపంలో రూ.200 కోట్ల‌ను సేక‌రించినందుకుగాను అమృత్ ప‌థ‌కం కింద రూ.26 కోట్ల ప్రోత్సాహ‌క బ‌హుమ‌తిని అంద‌జేస్తూ ప్ర‌త్యేక ప్ర‌శంసా ప‌త్రాన్ని కూడా ప్ర‌ధాని ప్ర‌ధానం చేశారు.ఉత్త‌రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, గృహ‌నిర్మాణం, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి హ‌రిదీప్‌సింగ్‌పురి, గ‌వ‌ర్న‌ర్ రాంలాల్ త‌దిత‌రులు కూడా హాజ‌రైన ఈ స‌మావేశంలో పుర‌స్కారాన్ని ప్ర‌ధాన మంత్రి అంద‌జేశారు