రశ్మిక మందన్నా ‘గీతా ఛలో’ ఆడియో లాంచ్‌..

150

గోల్డెన్‌స్టార్ గణేశ్, హ్యాట్రిక్ హీరోయిన్ రశ్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘గీతా… ఛలో’.వీకెంట్ పార్టీ అనేది ట్యాగ్‌లైన్. కన్నడలో ‘చమక్’ పేరుతో విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని శ్రీ రాజేశ్వరి ఫిల్మ్ పతాకంపై డి.దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ సంయుక్తంగా తెలుగులో ‘గీతా.. ఛలో’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 26న విడుదల అవుతున్న ఈ చిత్రం ఆడియో వేడుకను రామానాయుడు స్టుడియోలో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్, సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, నిర్మాతలు వీఎన్ ఆదిత్య, శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్, బాలాజీ నాగలింగం తదితర ప్రముఖులు హాజరై పాటలను ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాభినందనలు తెలిపారు.

Geetha Chalo Movie

తొలుత చిత్ర ట్రైలర్‌ను అతిథులు వీక్షించారు. అనంతరం పాటలను విడుదల చేశారు. ఈ చిత్రం యొక్క తొలి పాటను నిర్మాత వీఎన్ ఆదిత్య విడుదల చేయగా.. రెండో పాటను ఆర్పీ పట్నాయక్ విడుదల చేశారు. అలాగే మూడో పాటను ప్రేమకథా చిత్రం-2 నిర్మాత సుదర్శన్ విడుదల చేశారు. నాలుగో పాటను శ్రీధర్‌రెడ్డి విడుదల చేశారు. ఇక చివరి పాటను నిర్మాత బాలాజీ నాగలింగం విడుదల చేశారు. ఆడియో సీడీని ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ ఆవిష్కరించారు.