ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

228
TS Inter Result 2019
- Advertisement -

తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాలు ఈ రోజు(18-04-2019) విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి సాయంత్రం అయిదు గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎప్పటిలాగానే ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు.

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 2,70,575 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 59.8 శాతం ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 65 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షా ఫలితాల్లో 76 శాతంతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 29 శాతంతో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

- Advertisement -