జేఈఈ మెయిన్స్‌…సత్తాచాటిన తెలుగు విద్యార్థులు

351
Gattu Mytreya from Telangana gets 5th rank
- Advertisement -

దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎన్‌ఐటీలు, త్రిపుల్‌ఐటీలు, ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత కోసం నిర్వహించిన జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ)-2018 పేపర 1 ఫలితాలు విడుదలయ్యాయి. తెలగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు జేఈఈ ఫలితాల్లో సత్తాచాటారు. విజయవాడకు చెందిన సూరజ్ కృష్ణ 350 మార్కులతో దేశంలోనే తొలిస్ధానంలో నిలవగా చోడిపిల్లి హేమంత్ కుమార్ 2వ స్థానంలో, రాజస్థాన్‌కు చెందిన పార్థ్ లతూరియా 3వ ర్యాంకు సాధించారు.

తెలంగాణకు చెందిన గట్టు మైత్రేయ 5వ స్ధానంలో నిలవగా బాకారపు భరత్ (8), గోసుల వినాయక శ్రీవర్ధన్(10) టాప్-10లో చోటు దక్కించుకున్నారు. మొత్తం టాప్-10లో ఐదుగురు తెలుగు విద్యార్థులుండటం విశేషం.

కాగా, జేఈఈ మెయిన్స్‌ పేపర్‌-2 ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. దేశంలోని 112 కేంద్రాల్లో జేఈఈ పరీక్ష జరగగా మొత్తం 10,43,739 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మే 20న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మే 2 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -