11న విశాల్….అభిమన్యుడు

200
vishal
- Advertisement -

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అభిమన్యుడు’. ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. పలుమార్లు విడుదల తేది వాయిదా పడుతు వస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌ ఎట్టకేలకు కన్ఫామ్‌ అయింది. తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలోని ‘యాంగ్రి బర్డ్‌లాంటి నన్నె తను లవ్‌ చేసెలేరా..,తొలి తొలిగా తొలకరి చూసి పిల్లాడ్నై.. పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించిన ఈ చిత్రం విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో తెరకెక్కింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కీలక పాత్రలు పోషించారు.

మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, సహ నిర్మాత: ఇ.కె.ప్రకాశ్‌, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.

- Advertisement -