- Advertisement -
సామాన్యులకు షాక్‌ల మీద షాక్ ఇస్తోంది కేంద్రం. ఇప్పటికే పెరిగిన నిత్యావసర, పెట్రోల్,డీజీల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తాజాగా గ్యాస్ బండ రూపంలో షాకిచ్చింది. ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
కేంద్రం నిర్ణయంతో 21 కోట్ల మందికి సబ్సిడీని దూరం చేసినట్లు అవుతుంది. కొన్ని రోజులుగా సబ్సిడీని భారీగా తగ్గించిన కేంద్రం.. కొంతకాలంగా రూ.40 వరకు సబ్సిడీ ఇచ్చేది. ఇప్పటినుంచి అది కూడా నిలిచిపోనుంది.
ప్రస్తుతం దేశంలో 30 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. అందులో ఉజ్వల కనెక్షన్లు కేవలం 9 కోట్లు మాత్రమే. అంటే మిగిలిన 21 కోట్ల మంది మార్కెట్ రేటుకి అనుగుణంగా గ్యాస్ బండ కొనాల్సి ఉంటుంది.
- Advertisement -