గ్యాంగ్‌ లీడర్‌కు సెన్సార్ లైన్ క్లియర్

311
nani gang leader

న్యాచురల్ స్టార్ నాని – విక్రమ్ కుమార్.కె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్‌. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. సింగిల్ కట్ లేకుండా U/A సర్టిఫికెట్ పొందింది.

కామెడీ బేస్డ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని పెన్సిల్ పార్థసారథి గా కనిపించనున్నాడు. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ విలన్ గా నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు.

రు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిళ్లా,ప్రియదర్శి, రఘుబాబు,వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రంతో నాని ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచిచూడాలి.