గాంధీ ఆస్పత్రి సిబ్బంది టిక్‌ టాక్‌…వీడియో వైరల్

617
gandhi hospital tik tok
- Advertisement -

టిక్ టాక్  ఫీవర్ అందర్నీ ఊపేస్తోంది.టిక్ టాక్ వీడియోలు, సెల్ఫీలంటూ జనం రెచ్చిపోతున్నారు. డబ్ స్మాష్‌లు, వీడియోలు టిక్ టాక్, షేర్ ఇట్ యాప్‌ల్లో పోస్టు చేసేస్తున్నారు. ఇలాంటి యాప్‌లకు ప్రజలేంటి ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా అడిక్ట్ అవుతున్నారు. ఇటీవల ఖమ్మంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులో టిక్ టాక్ వీడియోలు చేసి ఉద్యోగాలు పొగొట్టుకున్న సంగతి మర్చిపోకముందే హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి సిబ్బంది డ్యూటీ టైమ్‌లో టిక్ టాక్ వీడియోలు చేసి అడ్డంగా బుక్ అయ్యారు.

గాంధీ ఆస్పత్రి ఫిజియో థెరపీ డిపార్టమెంట్ సిబ్బంది చేసిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆస్పత్రికి వచ్చిన రోగులను పట్టించుకోకుండా టిక్ టాక్ వీడియోలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఎంతో దూరం నుంచి గాంధీ ఆస్పత్రికి వైద్య చికిత్స కోసం వస్తే పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు. విధులను పక్కన పెట్టి టిక్ టాక్ వీడియో చేస్తూ కాలక్షేపం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

- Advertisement -