ఈ అర్ధరాత్రి నుంచి ఓటీటీలో ‘గాలివాన’..

127
Gaalivaana
- Advertisement -

ప్రతి నెలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ రిలీజ్‌లతో తెలుగు OTT ల్యాండ్‌స్కేప్‌లో బెంచ్‌మార్క్ సెట్ చేస్తోంది జీ5. ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అందించిన జీ5… తాజాగా ‘గాలివాన’ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్ ను బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించారు.

కుటుంబ అనుబంధాలకు సంబంధించిన ఎమోషన్స్ తో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఈ వెబ్ సిరీస్ భారీగా కనిపిస్తోంది. మదర్ సెంటిమెంట్‌తో పాటు, క్రైమ్ థిల్లర్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్ తెలిపారు. ఈ వెబ్ సిరీస్‌లో రాధిక, సాయికుమార్ లతో పాటు చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత, శరణ్య ప్రదీప్, తాగుబోతు రమేశ్ తదితరులు నటించారు.

- Advertisement -