ఫార్ములా వన్ వ‌ర‌ల్డ్ ఛాంపియనకు క‌రోనా..

203
Lewis Hamilton
- Advertisement -

కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా అలకల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు దాని బారిన పడి సామన్య ప్రజలతో పాటు ఎందరో ప్రముఖులు బలి అయ్యారు. తాజాగా ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ క‌రోనా బారిన ప‌డ్డాడు. ఏడు సార్లు ఫార్మలా వన్ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర పుటల్లోకి ఎక్కిన హామిల్టన్‌కు కరోనా సోకింది. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మిన‌హాయించి.. అత‌డు ఫిట్‌గా ఉన్న‌ట్లు మెర్సెడీజ్‌-ఏఎంజీ పెట్రొనాస్ ఎఫ్‌1 టీమ్ తెలిపింది.

అయితే గ‌త వారంలో హామిల్ట‌న్‌కు మూడుసార్లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించినా.. ప్ర‌తిసారీ నెగ‌టివ్ రిపోర్ట్ వ‌చ్చిన‌ట్లు టీమ్ చెప్పింది. ఆదివారం బ‌హ్రెయిన్ గ్రాండ్ ప్రి కూడా గెలిచాడు. అయితే సోమ‌వారం ఉద‌య‌మే అత‌నికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని టీమ్ తెలిపింది. ఆ త‌ర్వాత టెస్ట్ చేస్తే కొవిడ్ పాజిటివ్‌గా తేలిన‌ట్లు వెల్లడించింది. ప్ర‌స్తుతం బ‌హ్రెయిన్‌లో ఉన్న హామిల్ట‌న్‌.. అక్క‌డి నిబంధ‌న‌ల మేర‌కు ఐసోలేష‌న్‌లో ఉన్నాడు.

- Advertisement -