వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత..!

128
Sidda Raghava Rao

టీడీపీకి ఊహించని షాక్‌ తగిలింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ కీలకనేత, మాజీ శిద్ధా రాఘవరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైఎస్సార్‌సీపీ చేరారు. శిద్దా రాఘ‌వ‌రావు, ఆయ‌న కుమారుడు ఇద్దరికీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరినట్లు తెలిపారు. ఏడాది కాలంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, దీని వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు లబ్ధి పొందుతున్నారు. భవిష్యత్తులోనూ అనేక సంక్షేమ పథకాలు సీఎం అమలు చేయాలని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.