గవర్నర్ ను కలిసిన మాజీ ఎంపీ కవిత

411
kavitha Governer
- Advertisement -

బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు శుభాకాంక్షాలు తెలిపారు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి సభ్యులతో కలిసి ఇవాళ సాయంత్రం గవర్నర్ ను కలిశారు. కాగా ఈవిషయాన్ని తన ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు కవిత.

రాజ్ భవన్ లో ఎంగిలిపూల బతుకమ్మ రోజు గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ లోని సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. కాగా గత నెల 28నుంచి ఈనెల 06వ తేది వరకు తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

- Advertisement -