వేసవిలో ఫుడ్ పాయిజన్ అవ్వడం సర్వసాధారణమైన విషయం. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఫుడ్ త్వరగా పాడవుతుంది. పాడైన ఫుడ్ ను తినడం వల్ల ఫుడ్ పాయిజన్ బారిన పడి అనారోగ్యం పాలౌతుంటాము. ఇదే కాకుండా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు, లేదా జంక్ ఫుడ్ తిన్నప్పుడు, నిలా వుండే పదార్థాలు తిన్నప్పుడు, కలుషిత నీరు తగినప్పుడు.. ఇలా ఆయా కారణాల చేతే ఫుడ్ పాయిజన్ జరిగి అనారోగ్యం బారిన పడుతుంటాము. ఇలా ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కడుపులో తిప్పినట్లు ఉండడం, అజీర్తి, వాంతులు, విరోచనలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఫుడ్ పాయిజన్ ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ అయినప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.
ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు ఒక టీ స్పూన్ మెంతులు, పెరుగుతో కలిపి తీసుకుంటే కడుపులోని అసౌకర్యాన్ని తొలగిస్తుంది. అలాగే ఓక గ్లాస్ నీటిలో నిమ్మరసం కొద్దిగా పంచదార, చిటికెడు ఉప్పు వేసుకొని రోజుకు మూడు సార్లు తాగితే ఫుడ్ పాయిజన్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంకా ఫుడ్ పాయిజన్ లక్షణాలను తగ్గించడంలో అల్లం కూడా అద్భుతంగా పని చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తరిమిన అల్లం వేసి మరిగించి చల్లర్చిన తరువాత ఒక స్పూన్ తేనె కలిపి తాగితే.. వాంతులు, విరోచనల నుంచి విముక్తి లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక అన్నిటికి మించి శరీరాన్ని రీహైడ్రేట్ చేసే ఓఆర్ఎస్ ( ORS ) కచ్చితంగా ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక : ఈ చిట్కాలు సమస్య తీవ్రత కొద్దిగా ఉన్న సమయంలో ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ సమస్య తీవ్రత అధికంగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం అన్నీవిధాలా ఉత్తమం
ఇవి కూడా చదవండి…