ప‌వ‌న్ తో అమ్మడు మాస్ సాంగ్

58
- Advertisement -

చేతి నిండా ప‌ది సినిమాల‌తో బిజీగా ఉన్న శ్రీలీల ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తో చేస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్‌ సింగ్ షూటింగ్‌ లో జాయిన్ అయింది. శ్రీలీల డ్యాన్సుల‌కు విప‌రీతంగా ఫ్యాన్సున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ అభిమాని, హ‌రీష్ శంక‌ర్‌ ను శ్రీలీల‌కు, ప‌వ‌న్‌ కు ఓ మాస్ సాంగ్ పెట్ట‌మ‌ని కోర‌గా, దానికి హ‌రీష్ ఓకే అంటూ రిప్లై ఇవ్వ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు. మొత్తానికి పవన్ – శ్రీలీల కలయికలో మరి ఏ రేంజ్ సాంగ్ వస్తోందో చూడాలి. ఈ సినిమాకు దేవీశ్రీ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు. గతంలో దేవీశ్రీ పవన్ కళ్యాణ్ సినిమాలకు అనేక సూపర్ హిట్ సాంగ్స్ ను ఇచ్చాడు. కాబట్టి, ఈ సాంగ్ కి కూడా అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ వరుసగా 10 రోజుల పాటు డేట్స్ ఇచిన్నట్లు తెలుస్తోంది. ముందుగా యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తారట. దర్శకుడు హ‌రీష్ శంక‌ర్ మొదట అనుకున్న కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్క హీరోయిన్ కే స్కోప్ ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. పవన్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఏది ఏమైనా శ్రీలీలకి ఈ సినిమాతో భారీ ఆఫర్ వచ్చింది. సినిమా హిట్ అయితే, శ్రీలీల రేంజ్ పెరిగినట్టే. ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే.

ఇవి కూడా చదవండి…

Shobana:రెయిన్‌ సాంగ్‌ అంటే మర్డర్‌తో సమానం..

రాజమౌళి ఒక సినిమా స్కూల్‌ :ఆలియా

ఒక్క హిట్ తో ఎక్కడికో వెళ్ళింది

- Advertisement -