కేటీఆర్ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ….

265
first meeting of Cabinet Subcommittee
- Advertisement -

తెలంగాణలో డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్ కమీటీ ఈ రోజు సచివాలయంలో సమావేశం అయ్యింది. ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమీటీలో మంత్రులు ఈటెల రాజేందర్, జూపల్లి క్రిష్ణరావు, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డిలు ఉన్నారు. వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు, టి వ్యాలెట్ సర్వీస్ ప్రొవైడర్లతో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశానికి మంత్రులంతా హజరయ్యారు.

first meeting of Cabinet Subcommittee

తెలంగాణలో అన్ని ప్రభుత్వ శాఖల చెల్లింపులు డిజిటల్ రూపంలో జరగాలి, మెదట్లో సాద్యమైనంత ఎక్కువగా క్యాష్ లెస్ చెల్లింపులు చేస్తూ, దశలవారీగా తెలంగాణ రాష్ట్రాన్ని క్యాష్ లెస్ లావాదేవీలున్న రాష్ర్టంగా తయారు చేయాలన్నది ముఖ్యమంత్రి అదేశమని ఐటి శాఖ మంత్రి కెటిరామారావు తెలిపారు. ప్రస్తుతం డిమానటైజేషన్ వల్ల తలెత్తిన పరిమాణాలను ఒక అవకాశంగా తీసుకుంటామని, క్యాష్ లెస్ పద్దతులతో ప్రభుత్వ వ్యవస్ధలో పలు పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. అన్ని శాఖలు అంతిమంగా డిజిటల్ చెల్లింపులకు వెళ్లల్సిందేనని మంత్రి కెటి రామారావు తెలిపారు.

first meeting of Cabinet Subcommittee

ఈ క్యాష్ లెస్ చెల్లింపుల ద్వారా ప్రజలకు సౌకర్యం పెరగాలన్నదే తమ ప్రాథమిక లక్ష్యంగా మంత్రి కెటిఆర్‌ తెలిపారు. క్యాష్ లెస్ లావాదేవీలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు సమాంతరంగా తీసుకెళతామన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఐటి శాఖ అర్దిక లావాదేవీలపై ప్రజల్లో, వ్యాపారుల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు అవగాహణ కార్యక్రమాలను ఈ నెల 7వ తేది నుంచి ప్రారంభించిందని కేటీఆర్‌ తెలిపారు. ప్రజల నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి ప్రజలకు చేసే ప్రతి లావాదేవీలను టి వ్యాలెట్ ద్వారా ఉచితంగా, ఏలాంటి అదనపు చార్జీలు లేకుండా చూస్తామని ఆయన అన్నారు. ప్రజలు, ప్రైవేట్‌ సంస్ధలు(షాపులు మెదలైన వారీకి) చేసే లావాదేవీలను పూర్తిగా ఉచితం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. వివిధ సంస్ధలు, బ్యాంకుల మద్య పరస్పర సహకారంతో టి వ్యాలెట్ తో కలిసి పనిచేసేలా చూస్తామన్నారు. టి వ్యాలెట్ తో ఇతర వ్యాలెట్లకు సైతం చెల్లింపుల చేసే సౌకర్యం వచ్చేలా ప్రభుత్వాన్ని కోరతామన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నేరుగా ప్రధానితో మాట్లాడతానని తెలిపినట్లు మంత్రి కెటిరామారావు తెలిపారు.

టి వ్యాలెట్ మీద ఐటి శాఖ కార్యదర్శి ఉపసంఘానికి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే టి వ్యాలెట్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందని, దీంతోపాటు సెక్యూరిటీ, సౌకర్యం వంటి అంశాల్లో అత్యుత్తమంగా ఉంటుందన్నారు. డిజిటల్ చెల్లింపుల మీద ఏర్పాటైన సురేష్ చందా టాస్క్ పోర్స్ తమ కమీటీ అధ్యయానాన్ని, సూచనలను ఉపసంఘానికి తెలియజేశారు.

- Advertisement -