‘వీడెవడో’ సస్పెన్స్‌కు తెరపడింది

214
first look of sachin's veedevadu

అక్కినేని నాగార్జున నటవారసుడిగా ఆరంగ్రేటం చేసిన అఖిల్‌ తొలిసినిమాతో అంతగా ఆకట్టుకోలేక పోయాడు. దీంతో తన రెండో సినిమాపై తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, ఇటీవల ట్విట్టర్‌లో అఖిల్ చేసిన కామెంట్ ఆసక్తికరంగా మారింది. ప్రీ లుక్‌ని పోస్ట్ చేస్తూ వీడెవడో గుర్తించండి అంటూ ప్రశ్నను సందించాడు. అతనెవరో కనిపెట్టేందుకు నా టీంమెట్ అంటూ క్లూ ఇచ్చాడు. అయితే, అంతా నితిన్ అని భావించారు.

first look of sachin's veedevadu

ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగవైరలైంది. ఇక ఆడియన్స్‌లో కూడా బాగా క్యూరియాసిటి పెరిగిపోయింది. అయితే, ఆ ఫోటోలో ఉన్న వీడెవడో తెలిసిపోయింది. ఆయన ఎవరో కాదు మూడేళ్ల క్రితం నీజతగా నేనుండాలి అంటూ ఆషికి 2 రీమేక్‌తో వచ్చిన సచిన్ జోషి. చాలా కాలం గ్యాప్ తర్వాత సచిన్ జోషి ఇప్పుడు వీడెవడు అంటూ తెలుగులో, యార్ ఇవాన్ అంటూ తమిళ్‌లో కనిపించనున్నారు.

దీంతో పాటు వీడెవడు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సచిన్ జోషి డైలాగ్‌తో సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నం చేశారు. ఇక ఈ మోషన్ పోస్టర్‌లోని సచిన్ డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది. సచిన్‌,అఖిల్ ఇద్దరూ మంచి స్నేహితులు. దీంతో సచిన్ సినిమాకు అఖిల్ ప్రచారం కల్పించేందుకు ఈ విధంగా చేశాడట.