అబ్దుల్ కలాం … ఫస్ట్ లుక్‌

242
Abdul Kalam Biopic First Look
- Advertisement -

అంతరిక్ష పరిశోధనలో భారత్‌ మరో మైలరాయిని చేరింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించింది. పీఎస్‌ఎల్‌వీ-సీ37 ప్రయోగం విజయవంతమవడంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఇస్రోపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ ప్రయోగం దేశానికి, మన అంతరిక్ష పరిశోధన రంగానికి గర్వకారణమని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మన శాస్త్రవేత్తలకు దేశం సెల్యూట్‌ చేస్తోందని  ట్వీట్‌ చేశారు.

ఇదిఇలా మాజీ రాష్ట్రపతి ,శాస్త్రవేత్త , మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కలాం మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి చిత్ర యూనిట్ ఇస్రోకి అభినందనలు  తెలిపింది. పీఎస్‌ఎల్వీ సీ 37తో ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించిందని కలాం ఫోటోతో కూడిన ఫోటోను షేర్‌ చేసింది చిత్ర యూనిట్.

ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ లు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్‌ టైన్ మెంట్ పతాకంపై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కలాం సాధించిన విజయాలు,పోక్రాన్ అణు బాంబు ప్రయోగం, సిఐఎని ఎలా ఫూల్ చేసింది, పేపర్ బాయ్ రాష్ట్రపతి స్థాయికి ఎలా ఎదిగింది మొదలైన స్పూర్తి దాయక విషయాలను చూపించనున్నారు.

కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ పిల్లలకు, యువతకు అబ్దుల్ కలాం స్ఫూర్తినిచ్చారు. మిసైల్ మ్యాన్ గా కలాం ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. భారతరత్న సహా కలాం ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. 2002లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు కలాం.

Abdul Kalam Biopic First Look

- Advertisement -