మొన్న కేకులు.. నేడు జోకులు..

269
fifa
- Advertisement -

రష్యావేధికగా ఫిఫా వరల్డ్ జరుతున్న విషయం తెలిసిందే. అయితే హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన అర్జెంటీనా, పోర్చుగల్ జట్లు ఇంటి ముఖం పట్టాయి. మెస్సీ, క్రిస్టియానో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్న జట్లు క్వాటర్స్ మ్యాచ్ లోనే నిష్క్రమించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్ లలో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒక్క గోల్ కూడా చేయకపోవడం గమనార్హం.

ఈ రెండు జట్లు ఒకే రోజు రష్యావేదికను నిష్క్రమించాయి. మెస్పీ ప్రాతినిధ్యం వహించిన అర్జెంటీనా, ప్రాన్స్ చేతిలో3-4 తేడాతో ఓడిపోయింది. ఇక క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహించిన పోర్చుగల్, ఉరుగ్వేపై1-2 తేడాతో ఓడిపోయింది. దీంతో పెద్ద ఎత్తున్న అభిమానులు ఈ ఇద్దరిపై నెటింట్లో జోకులు పేలుస్తున్నారు. మెస్సీ బర్త్ డే సందర్భంగా  ఆయనపై అభిమానంతో చాక్ లేట్ కేకులు చేయగా.. నేడు ఆయనపై జోకులు పేలుతున్నాయి.

fifa

ఓటమి తర్వాత మెస్సీ, రొనాల్డో ఇద్దరు ఎయిర్ పోర్టులో కలుసుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ చూడండి ఓ అభిమాని ట్వీట్ చేశాడు. రొనాల్డో, మెస్సీని ఏ సమయానికి వెళ్తున్నావ్ అంటూ అడగగా.. మెస్పీ 11.30 కి వెళ్తున్నా అని రిప్లై ఇస్తాడు. వెంటేనే రొనాల్డో నీకంటే ముందే నేనుంటా అంటూ రిప్లై ఇస్తాడు. ఓకే ఇద్దరం ఎయిర్ పోర్టులో కలుసుకుందాం అని చాటింటి చేసినట్లు ట్వీట్ చేశాడు.

- Advertisement -