వచ్చే యేడాది నుంచి మహిళ ఐపీఎల్‌ ప్రారంభం

158
- Advertisement -

ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ను 2007లో స్థాపించినప్పటి నుంచి క్రికెట్‌ అభిమానులను ఒకమెట్టు పైఎక్కి అలరిస్తోంది. ప్రతి సీజన్‌లో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. క్రికెట్‌ అభిమానులు కూడా కొత్తదనం కోసం ఉవ్విళూరూతున్నారు. క్రికెట్‌ లవర్స్‌కు బీసీసీఐ ఒక కీలక ప్రకటన చేయబోతుంది. అదే…మహిళల ఐపీఎల్‌..టోర్నీకి రంగం సిద్ధమవుతోంది.

ఐదు జట్లతో కూడిన తొలి ఎడిషన్‌ టోర్నీని వచ్చే యేడాది నుంచి ప్రారంభించాలని బీసీసీఐ ప్రణాళికలు వేస్తోంది. ఇందులో మొత్తం ఐదు జట్లు ఉంటాయని ఇందులో మొత్తం 20 లీగ్‌ గేమ్స్‌ ఆడాల్సి ఉంటుందని తెలిపింది. ఒక్కొక్క జట్టు రెండు సార్లు పరస్పరం ఆడుతాయి. టేబుల్‌లో టాప్‌ ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఇక రెండు, మూడవ స్థానంలో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగుతుందని తెలిపింది.

ప్రతి జట్టులో ఐదు మంది విదేశి క్రికెటర్లకు అనుమతి ఇస్తామని ప్రకటించారు. ఆస్ట్రేలియాలో జ‌రిగే బిగ్ బాష్ మ‌హిళ‌ల లీగ్‌, యూకేలో జ‌రిగే మ‌హిళ‌ల లీగ్‌ల్లో జ‌ట్టుకు కేవ‌లం ముగ్గురు విదేశీ ప్లేయ‌ర్ల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు. ఇక ఆ టోర్నీల్లో ఒక్కొక్క జ‌ట్టు బృందంలో 15 మంది ఉంటారు. ఐపీఎల్‌లో మాత్రం 18 మంది ఒక్కొక్క జ‌ట్టులో ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో 9 నుంచి 16 మ‌ధ్య ద‌క్షిణాఫ్రికాలో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత ఐపీఎల్ టోర్నీ నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. తొలి ఎడిష‌న్‌లో ఒక వేదిక‌పై 10 మ్యాచ్‌లు, మ‌రో వేదిక‌పై 10 మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -