రైతులతో కేంద్రం చర్చలు మరోసారి విఫలం..

201
Farmers' Protest
- Advertisement -

శనివారం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాల నేతలతో 5వ విడత చర్చలను జరిపింది. కొద్దిసేపటి క్రితమే రైతులతో కేంద్రం చర్చలు ముగిసాయి.. అయితే ఇవాళ కూడా చర్చలు కొలిక్కిరాలేదు. రైతులతో కేంద్ర ప్రభుత్వ జరిపిన చర్చలు మరోసారి అసంపూర్తిగా ముగిసాయి. రైతుల ఆందోళనలపై ప్రభుత్వ బుజ్జగింపులు ఫలించలేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న మరోసారి చర్చలు జరుపుతామని కేంద్రం తెలిపింది. దీనికి ఇరు పక్షాలు అంగీకరించాయి. అయితే ఈ లోగా నిరసన ప్రాంతాల నుంచి వృద్ధులు, పిల్లలని ఇళ్లకు పంపించాల్సిందిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులను కోరారు.

చర్చల్లో భాగంగా కేంద్ర తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనని రైతు సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. కనీస మద్దతు ధర, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వివాదాలు, ప్రైవేటు కొనుగోళ్లపై భద్రత వంటి అంశాలపై రైతుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ చర్చల తర్వాతే అంశాల వారీగా చర్చ జరుపుతాం అంటున్న రైతు సంఘాలు. ఈ నేపథ్యంలో రైతులు, కేంద్రం ప్రతిష్టంభన మధ్య కొనసాగుతుంది.

- Advertisement -