నల్లగొండలో అక్రమాలకు పాల్పడుతున్న దొంగ బాబా అరెస్ట్..

427
Fake Baba
- Advertisement -

అమాయక ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెప్పి డబ్బులు గుంజుతూ అక్రమాలకు పాల్పడుతున్న దొంగ బాబా విశ్వ చైతన్య స్వామిని అరెస్ట్ చేసినట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు. నల్లగొండ జిల్లా పి‌.ఏ. పల్లి మండలం అజ్మాపూర్ గ్రామంలో శ్రీ సాయి సర్వస్వం సాయి మాన్సీ ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఆశ్రమం నెలకొలిపి అమాయక భక్తులకు మాయ మాటలు చెప్పి పూజలు హోమాలా పేరుతో మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు దొంగ బాబా.

ఆర్ధికంగా వున్నమహిళా భక్తులను సాయి బాబా ప్రవచనాల పేరుతో ఆకర్షించి లోబర్చుకునే వాడని తెలిపారు. ఇప్పటివరకు కొంత మంది మహిళలతో ఇతనికి సంబందాలు ఉన్నట్లుగా విచారణలో తేలిందన్నారు. ఆర్థికంగా బలంగా వున్న భక్తులను సాయిబాబా ప్రవచనాల పేరుతో ఆకర్షించుకొని బాబానే తనకు స్వయంగా కలలోకి వచ్చి మీ వద్ద నుండి డొనేషన్లలు, నగదు, బంగారం రూపంలో తీసుకోమని , దానికి, అంతకంటే ఏక్కువ రేట్లు లాభం చేకురుతుందని చెప్పినాడు అని మాయ మాటలు చెప్తూ వారి వద్ద నుండి మోసపూరిత ఆలోచనతో డొనేషన్లు పొందేవాడని తెలిపారు. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారాలు, ఆర్థిక లాభాల కోసం పూజల పేరుతో నకిలీ వన మూలికలు, చూర్ణము, తైలము, నకిలీ యంత్రాలు లాంటివి తయారు చేసి తన మాటలతో ఎక్కువ మొత్తంలో నగదు వసూలు చేసేవాడని డిఐజి తెలిపారు.

ఇవే కాకుండా సాయి దివ్యా రక్షా కవచము యంత్రము (1200 నుండి 2000 రూపాయలు), మాయా చెదిని(500), నవ దాతు దీప నూనె(500), అబిచార రక్షా మాలా(700), సీతల మాలా(1500), సూర్య మాలా(రుద్రాక్ష)(1500) బొదిని బందనా అగరబత్తి (700), మొగలి పువ్వు కుంకుమ(150) ఇక రకరకాల పేర్లతో హైదరాబాద్ మోహింజా మార్కెట్ లో కొనుగోలు చేసి వచ్చి, వాటికి పూజలు, హోమాలు చేశామని చెప్పి వాటిని అమాయక ప్రజలకు మాయ మాటలతో అధిక దరలకు విక్రయించేవాడని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నందిగామకు చెందిన విశ్వ చైతన్య డిగ్రీ MPJ పూర్తి చేసి, 2002 హైదరాబాద్, శివం రోడ్ న్యూ నల్లకుంట, ప్రీమియర్ కంప్యూటర్ సెంటర్ పెట్టి, ప్రజల నుండి సుమారు 1 కోటి రూపాయల డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి పారిపోగా, నాంపల్లి పోలీసు స్టేషన్‌లో ఇతనిపై కేసు నమోదు అయ్యి 20 రోజులు జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటికి వచ్చినట్లు ఆయన వివరించారు. ఆ తర్వాత సాయి బాబా భక్తుడిగా మారి పౌరోహిత్యం, సాయి సచ్చరిత్రపై ప్రవచనాలు, జెమిని టి‌వి, జీ టివి, పూజా టి‌వి, భక్తి టి‌వి, చానల్స్ నందు ప్రవచనాలు చెప్పాడని 2017 సంవత్సరంలో సొంతంగా యూ ట్యూబ్ చానల్ శ్రీ సాయి సర్వస్వం పేరుతో ఏర్పాటు చేసి అందులో ప్రవచనాల వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉండేవాడని, కొన్ని రోజుల తరువాత భక్తులకు ఆన్లైన్ నందు డైరెక్ట్ అపాయింట్ మెంట్ కొరకు రోజుకు ఫీజు 500 రూపాయాలతో మొదలు పెట్టి 1100 రూపాయల వరకు తీసుకొని వారితో మాట్లాడి వారి సమస్యలను విని పరిష్కారాలు చెప్పి, సమస్యను మనసులో చెప్పుకొని నేను ఇచ్చే వన మూలికలను బాబా ఆలయాలలో వుండే దూని నందు వేయమని సలహా ఇచ్చేవాడని, ఇట్టి వన మూలికలు తన వద్దనే కొనుక్కోవాలని చెప్పి 200 నుండి 600 వరకు తీసుకొని ఇచ్చేవాడని తెలిపారు. మరి కొంత మందికి కొరియర్ ద్వారా అందించే వాడని డిఐజి రంగనాధ్ తెలిపారు.

ముఖ్యంగా దొంగ బాబా వేషంలో చాలా మంది మహిళలతో సన్నితంగా ఉంటూ, అతనితో సంబోగిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని మాయ మాటలు చేప్పి వారిని లోబర్చుకునేవాడని వివరించారు.ఇతని మోసాలపై వచ్చిన పిర్యాదు నేపధ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విచారణ చేసి ఈ దొంగ స్వామిజిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.

అరెస్ట్ చేసిన వారి వివరాలు:

A-1
Ambadipudi Sai Vishwa Chaithanya @ Vishwanadha Murali S/o Late AV Sharma Age:- 50years Caste:- Brahmins Occ:- Social Service R/o H.No 2-2-1130/ 19 C,Ambadipudi Enclave Plot No G1 Prashanth Nagar, New Nallakunta Hyderabad Present C/o Sai Maansi Charitable Trust Azmapur Village PA Pally Mandal Nalgonda Dist.

A-2
Gajula goutham, s/o prabhakar, age 26yrs, caste: balija, occ: video editing, r/o narayanapuram village of Kalyandurgam mandal, Ananthapur dist.

A-3
Vangaru Srujan Kumar, s/o neelakanteshwar rao, age 28yrs, Padmashali, occ: data entry operator, r/o Sri city venture, barugudem, Khammam town.

A-4
Orsu vijay s/o Sathaiah, age 25yrs, caste: Waddera, occ: driver, r/o Akuthota pally village of Amanagallu mandal.

ఈ కేసులో సమర్ధవంతంగా పని చేసిన నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ సిఐలు మహబూబ్ బాషా, నల్లగొండ వన్ టౌన్ సిఐ బాలగోపాల్, ఇతర సిబ్బందిని డిఐజి ఏ.వి.రంగనాధ్ ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -