పటేల్‌ విగ్రహాం…ప్రత్యేకతలు ఇవే

248
sardar
- Advertisement -

భారతదేశ ప్రప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేశారు. గుజరాత్‌లోని కేవడియాలో విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంటనే హెలికాప్టర్లపై నుంచి పటేల్ విగ్రహంపై పూల వర్షం కురిసింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ విగ్రహాన్ని 182 మీట‌ర్ల ఎత్తులో నిర్మించారు.

విగ్రహా విశిష్టతలు..

()విగ్రహం ఎత్తు: 182 మీటర్లు (సుమారు 597 అడుగులు)
()నిర్మాణ వ్యయం:2,989 కోట్లు
()నిర్మాణ ప్రదేశం: సాధు బెట్‌ ఐలాండ్‌. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌కు 3.5 కిలోమీటర్ల దూరం
() గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకోగలదు
() 6.5 తీవ్రతతో వచ్చే భూకంపాలనూ తట్టుకుని నిలవగలదు.
()నిర్మాణంలో 1700 టన్నుల కాంస్యం, 1,80,000 క్యూబిక్‌ మీటర్ల సిమెంటు, 18,500 టన్నుల స్టీల్‌ కాంక్రీట్‌లో కలిపి, 6500 టన్నుల స్టీల్‌ విడిగా స్ట్రక్చర్‌ కోసం వాడారు.
() విగ్రహం ఛాతీ వరకూ రెండు లిఫ్ట్‌ల్లో సందర్శకులు వెళ్లవచ్చు .ఒకేసారి 200 మంది నిలుచుని పరిసరాలను వీక్షించవచ్చు.
() ఒక్కో లిఫ్ట్‌లో ఒకేసారి 26 మంది వెళ్లవచ్చు. కేవలం అరనిమిషంలో లిఫ్ట్‌ 500 అడుగులు వెళ్తుంది.

 

- Advertisement -