ప్రమాదంలో భారత క్రికెట్:గంగూలీ

279
ganguly
- Advertisement -

భారత క్రికెట్ ప్రమాదంలో పడిందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీసీసీ..సీఓఏ(పరిపాలకుల కమిటీ) నియంత్రణలోకి వెళ్లిపోయిన దగ్గరి నుంచి వారు ఆడిందే ఆట,పాడిందే పాటగా సాగుతోందన్నారు. ఈ మేరకు లేఖ విడుదల చేసిన గంగూలీ..ధోనిని జట్టు నుంచి తప్పించడం సబబే అన్నారు. ధోనిని దూరం పెట్టడం తనకేం ఆశ్చర్యం అనిపించలేదని, ఎంత పెద్ద ఆటగాడైనా.. రోజు ఆడకపోతే.. ఆటపై ఉన్న పట్టు కోల్పోతాడు అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

భారత క్రికెట్‌ పరిపాలన ఎక్కడికి దారి తీస్తుందో అనే భయం కారణంగా ఆవేదనతో ఈ లేఖ రాస్తున్నానని గంగూలీ తెలిపారు. భారత క్రికెట్ పరువు మర్యాదలు మాకు ఎంతో ముఖ్యమని..అందుకే తాజా పరిస్థితి గురించి ఆలోచించాల్సి వస్తోందన్నారు. లక్షలాది అభిమానుల నమ్మకం సడలిపోతోందని ఇటీవల వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, ముఖ్యంగా వాటిని ఎదుర్కొన్న తీరు  బీసీసీఐ పరువు తీసేశాయని తెలిపారు.

ఇక కోచ్‌ను ఎంపిక చేసే విషయంలో నాకు భయంకరమైన అనుభవం ఎదురైందని తెలిపారు గంగూలీ. అంతర్జాతీయ మ్యాచ్‌కు ఒక క్రికెట్‌ సంఘం నుంచి ఎవరినైనా పిలవాలని భావిస్తే ఎవరికి ఆహ్వానం పంపాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే భారత క్రికెట్ ప్రమాదంలో పడింది అని స్ఫష్టం చేయగలనని తెలిపారు.

- Advertisement -