మోదీ రాక ముందు మోదీ వచ్చాక.. చరిత్రలోనే తొలిసారి..!

175
modi
- Advertisement -

అభిషేక్ సింగ్ అనే ఆడిటర్ మన దేశ ఆర్థిక వ్యవస్థ/స్థితి గురించి పలు ఆసక్తికర విషయాలు వివరించాడు. మోదీకి ముందు మోదీ వచ్చాక అనే ప్రాతిపదికన చెప్పాడు. ఆయన చెప్పిన విషయాలు.. మన దేశంలో 1947 నుండి 2014 వరకు ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య 3.79 కోట్లుండగా, ఆ సంఖ్య 2014 నుండి 2018 వరకు నాలుగేళ్ళ వ్యవధిలో దాదాపు రెండింతలయి 6.84 కోట్లకు పెరిగి సుమారు 3 కోట్ల పైచిలుకు మందిని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకురాగా చరిత్రలోనే మొట్టమొదటిసారి 10 లక్షల కోట్ల రూపాయలు ఆదాయపు పన్ను రూపంలో వసూలయింది.

అలాగే ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ (కస్టమ్స్ డ్యూటీ, సేల్స్‌టాక్స్) చెల్లించేవారి సంఖ్య 2014 కి ముందు 65 నుండి 70 లక్షలుండగా అది 2014 GST తరువాత 2018 వరకు 1 కోటి 10 లక్షలకు పెరిగి అదనంగా సుమారు 40 లక్షల మంది వ్యాపారులు ట్యాక్స్ పరిధిలోకి తీసుకురాబడ్డారు. నోట్ల డీమానెటైజేషన్‌కి ముందు రూ.100 మరియు అంతకంటే తక్కువ విలువ నోట్లు మన దేశంలో ముద్రిస్తుండగా, 500 మరియు 1000 రూ.ల నోట్లు మాత్రం యూరోప్ దేశాలలో ప్రింట్ చేయిస్తుండేవారు, అలా ఒక్కో 500 నోటుకు రూ.3.75 మరియు 1000 నోటుకు రూ.4.50 చొప్పున చెల్లించేవారు.

ప్రస్తుతం 500 మరియు 2000ల నోట్లు మన దేశంలోనే ముద్రిస్తున్నారు, దీనితో మనకు దాదాపు 1.5 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతోంది. నోట్ల డీమానెటైజేషన్‌ తరువాత భారత ప్రభుత్వం సుమారు 3 లక్షల హవాలా కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు చేయగా అందులో ఒక్కడంటే ఒక్కడు కూడా తమ డబ్బుల కోసం రాలేదు, హవాలా వారు ప్రభుత్వాన్ని డబ్బడిగితే లెక్కలు చెప్పాలి, హవాలా వాళ్ళ దగ్గర లెక్కలుండవు కదా అందుకే ఎవరూ రాలేదు, దానితో దాదాపు 37 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి.

- Advertisement -