ఫేస్ బుక్‌ ఒత్తిడికి తలొగ్గిన ఆసీస్..!

426
fb
- Advertisement -

ఫేస్ బుక్ ఒత్తిడికి తలొగ్గింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఫేస్ బుక్ విధించిన షరతులకు ఆసీస్ ప్రభుత్వం అంగీకరించడంతో ఆస్ట్రేలియా న్యూస్ పేజీల‌పై తాము విధించిన నిషేధాన్ని రానున్న రోజుల్లో ఎత్తేస్తామ‌ని ఫేస్‌బుక్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. తాము తీసుకొచ్చిన మీడియా చ‌ట్టాన్ని స‌వ‌రించ‌డానికి ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం అంగీక‌రించ‌డంతో ఫేస్‌బుక్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఆసీస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్ర‌కారం కంటెంట్ వాడుకుంటున్నందుకు ఫేస్‌బుక్.. మీడియా సంస్థ‌ల‌కు డ‌బ్బు చెల్లించాల‌ని ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీనిపై తీవ్ర నిరస‌న వ్య‌క్తం చేసిన ఫేస్‌బుక్‌ అక్క‌డి న్యూస్ పేజీల‌పై నిషేధం విధించింది. ఫేస్‌బుక్ స‌డెన్‌గా తీసుకున్న నిర్ణ‌యంపై దేశ‌వ్యాప్తంగా ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో దిగొచ్చిన ప్ర‌భుత్వం ఫేస్‌బుక్‌ను చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించింది.

- Advertisement -