ఫేస్ బుక్ ఇకపై మెటా..

149
fb
- Advertisement -

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్‌ పేరు మారింది. ఇకపై ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు ‘మెటా’ మాతృసంస్థగా ఉంటుందన్నారు.అయితే ఫెస్‌బుక్‌తోపాటు కంపెనీకి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు ఇన్‌స్ట్రాగ్రాం, మెసేంజర్‌, వాట్సాప్‌ పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు.

కొత్తగా అందు‌బా‌టు‌లోకి తీసు‌కు‌రా‌బోయే మెటా‌వర్స్‌ ఫేస్‌‌బు‌క్‌కు ‘మెటా’ అని పేరు మార్చి‌నట్టు సంస్థ సీఈవో జుక‌ర్‌‌బర్గ్‌ ప్రక‌టిం‌చారు. వర్చు‌వ‌ల్‌/‌ఆ‌గ్యు‌మెం‌టెడ్‌ రియా‌లి‌టీలో విని‌యో‌గ‌దా‌రులు సంభా‌షిం‌చు‌కొ‌నేలా ఫేస్‌‌బుక్‌ త్వరలో సేవ‌లను అందు‌బా‌టు‌లోకి తీసు‌కు‌రా‌నుంది. దీనిని మెటా‌వ‌ర్స్‌గా చెప్తు‌న్నారు. అయితే, సమా‌చార దుర్వి‌ని‌యోగం, సమా‌చార భద్రతపై ఆందో‌ళ‌నలు విద్వే‌షాన్ని వ్యాప్తి చేయడం ద్వారా డబ్బులు ఆర్జి‌స్తుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పేరు మార్చారనే ప్రచారం జరుగుతోంది.

- Advertisement -