బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 54 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తొలుత మానస్‌తో ముచ్చట్లు చెప్పుకొచ్చింది ప్రియాంక. 10వ వారంలో తాను ఎలిమినేట్ అవుతానని అనిపిస్తుందని చెప్పింది. మధ్యలో రవి ప్రస్తావన తీసుకొచ్చింది ప్రియాంక. రవి డే 1 నుంచి గేమ్‌లో ఉన్నాడు…. అందుకే హౌస్‌లో ఉన్న వాళ్లతో దగ్గర అవ్వాలనో లేదంటే ఫ్రెండ్ షిప్ చేయాలనో గేమ్ ఆడటం లేదు.. ఏది మాట్లాడినా గేమ్ పరంగానే చూస్తున్నాడు అంటూ ప్రియాంకకి హితబోధ చేశాడు మానస్.
తర్వాత గుడ్డు కోసం సిరితో రేషన్ మేనేజర్ కాజల్, కెప్టెన్ సన్నీలు చాలాసేపు డిస్కషన్ చేశారు. సిరి, షణ్ముఖ్, శ్రీరామ్‌లు ఎక్స్ ట్రా గుడ్లును తినేయడంతో ఈరోజు ఎగ్స్ కట్ చేసింది కాజల్. దీంతో సిరి.. వాదనకు దిగింది. ఇక షణ్ముఖ్‌తో రొమాన్స్ కంటిన్యూ చేసింది సిరి. షణ్ముఖ్ సోఫాలో పడుకుని ఉండగా.. వెళ్లి అతనికి ముద్దు పెట్టేసింది. నేను నీ పక్కన ఉంటే ఏమైనా ప్రాబ్లమ్‌నా అని షణ్ముఖ్‌ని అడిగింది సిరి. ప్రాబ్లమ్ ఉంటే ముఖంపైనే చెప్తా.. నువ్ మెంటల్లీ డిస్ట్రబ్‌లో ఉన్నట్టు ఉన్నావ్ అని చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.
ఇక కెప్టెన్ టాస్క్‌లో భాగంగా మానస్, జెస్సీ, సిరి, షణ్ముఖ్, ఆనీ, శ్రీరామ్ పోటీపడగా ఈ టాస్క్‌కి సంచాలకులుగా జెస్సీ నియమించారు బిగ్ బాస్. ధర్మోకోల్ బాల్స్ ఉన్న సంచీలను ఒక్కొక్కరికీ ఇచ్చి.. సర్కిల్ లోపల ఆగకుండా తిరగాలని.. పోటీదారులు నడక ఆపకుండా తిరుగుతూ వారి సంచిలోని ధర్మాకోల్ బాల్స్ కింద పడకుండా కాపాడుకోవాలని.. అలాగే పోటీదారుల సంచిలను ఖాళీ చేయొచ్చని చెప్పారు. బిగ్ బాస్ కండిషన్స్‌ని జెస్సీ సరిగా అర్ధం చేసుకోకపోవడంతో సభ్యులంతా గందరగోళానికి గురయ్యారు. దీంతో బిగ్ బాస్ జెస్సీని కన్‌ఫెషన్ రూమ్‌కి పిలిచి చెప్పడంతో తిరిగి మొదటి నుండి గేమ్‌ని మొదలుపెట్టాడు జెస్సీ.
ఈ క్రమంలో సన్నీ-శ్రీరామ్‌లో కింద మీద పడి ఒకర్నొకరు టార్గెట్ చేసుకున్నారు. దీంతో సన్నీ ఫస్ట్ రౌండ్‌లో గేమ్ నుంచి బయటకు వచ్చేశాడు. శ్రీరామ్ బ్యాగ్‌లో ఉన్న బాల్స్ మొత్తం తీసేశా.. నువ్ ఆడుకో మానస్ అని చెప్పడంతో.. శ్రీరామ్‌కి కాలింది. ప్రియ గారు నీ గేమ్ గురించి కరెక్ట్‌గా చెప్పారు.. నీ ఫ్రెండ్‌ని గెలిపించుకోవడం కోసం నన్ను ఎటాక్ చేశావా? అని అన్నాడు. ఈ క్రమంలో శ్రీరామ్-మానస్‌లు ఇద్దరూ కిందపడిపోవడంతో ఇద్దర్నీ గేమ్ నుంచి తప్పించాడు జెస్సీ. దీంతో జెస్సీతో వాదనకు దిగారు సన్నీ. సన్నీ లేవనెత్తిన పాయింట్లకు సరైన కారణం చెప్పలేక జెస్సీ తడబడ్డాడు. చివరగా షణ్ముఖ్-సిరి, అనీ మాస్టర్ మిగలగా చివరివరకు పోరాడిన అనీ మాస్టర్ తర్వాత తనంతా తనే పోటీ నుండి వైదొలగింది. చివరగా షణ్ముఖ్ విజేతగా నిలిచి 8వ వారంలో కెప్టెన్ అయ్యారు.

