కరోనా వ్యాప్తి నేపథ్యలో దేశం మొత్తం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ మే 3 కొనసాగనుంది. అయితే లాక్‌డౌన్ కారణంగా కోల్‌కతాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిజామాబాద్ వాసులను మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మంచి మనసుతో ఆదుకుంది. నిజామాబాద్ పట్టణానికి.. వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 20 మంది యువకులు కోల్‌కతాలో ఐఎఫ్‌సీసీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే లాక్‌డౌన్ కారణంగా వీరంతా కోల్‌కతాలో చిక్కుకుపోయారు నిత్యావసర వస్తువులు, భోజన సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే భాదితులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దృష్టికి తెచ్చారు. భాదితుల్లో ఒకరైన యోగేష్ ట్విట్టర్ ద్వారా తమ బాధను తెలియజేశాడు. విషయం తెలుకున్న మాజీ ఎంపీ కవిత వెంటనే అక్కడి అధికారులతో మాట్లాడి నిజామాబాద్ వాసులకు సరైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే వారికి నిత్యావసర సరుకులు అందేలా ఏర్పాట్లు చేయించారు. కష్టకాలంలో ఆదుకున్న కవితకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.