మాజీ ఎమ్మెల్యే రాంమూర్తి యాదవ్ మృతి…

604
ex mla
- Advertisement -

చలకుర్తి మాజీ ఎమ్మెల్యే, బడుగువర్గాల ఆశాజ్యోతి గుండెబోయిన రాంమూర్తి యాదవ్ కన్నుమూశారు. 1994లో చలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఆయన సేవలు అందించారు. అప్పటికి ఓటమి ఎరుగని మాజీ మంత్రి జానారెడ్డి పై ఘన విజయం సాధించారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన రాంమూర్తి యాదవ్ పేద ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాంతం తాపత్రయ పడ్డారు.

1947 అక్టోబర్ 26 న గుండెబోయిన మట్టయ్య, మహా లక్ష్మమ్మ దంపతుల కుమారుడిగా ఆయన జన్మించారు.1981 లో పెద్ద దేవుల పల్లి గ్రామ సర్పంచ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

రాంమూర్తి యాదవ్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.ఆయన కుటుంభ సబ్యులకు ప్రగాఢ సానుభూతుని తెలిపారు.నిమ్న జాతుల అభ్యున్నతి కోసం కృషి చేసి ,మచ్చలేని నాయకునిగా, నిరాడంబరుడిగా,, అజాత శత్రువు గా,ఆయన పాటించిన విలువలు నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.

- Advertisement -