మాస్‌ డైరెక్టర్‌తో రజనీ…168

525
rajanikanth
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. ఈ సినిమా త్వరలో విడుదల కానుండగా నెక్ట్స్ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చేశారు రజనీకాంత్. వీరం,వేదలం చిత్రాల ఫేం శివ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా చేయనున్నాడు.

ప్రస్తుతం సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న శివ, ఇది పూర్తయిన వెంటనే రజనీకాంత్ సినిమా పనులు ప్రారంభించనున్నాడు. అజిత్ హీరోగా వీరం, వేదలం, వివేగం, విశ్వాసం నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో రజనీ సైతం శివతో మూవీకి ఓకే చెప్పాడు.

ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న దర్బార్‌ సినిమాలో రజనీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాడు. రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా సునీల్‌ శెట్టి, శ్రియ శరణ్, నివేదా థామస్‌, యోగిబాబులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2020 సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -