మాజీ మంత్రి చందూలాల్ కన్నుమూత….

24
chandu lal

టీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్(66) ఇకలేరు.గరువారం రాత్రి ఆయన కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం కరోనా రావడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్, కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. మూడు సార్లు శాసనసభకు, రెండు సార్లు లోక్ సభకు చందూలాల్ ఎన్నికయ్యారు. 2014 లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజక వర్గం నుంచి గెలుపొంది సాంస్కృతిక, పర్యాటక మంత్రిగా పని చేశారు చందూలాల్‌.

చందూలాల్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గిరిజన ప్రజల సమస్యలకోసం ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. చందూలాల్‌ మృతిపట్ల రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపం తెలిపారు. చందూలాల్‌ పార్థివ దేహాన్ని స్వస్థలానికి తరలిస్తున్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.