మదర్‌ థెరిసానే ఆదర్శం: ఎర్రబెల్లి

69
tresa
- Advertisement -

ప్రతి ఒక్కరు మదర్ థెరిసాను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.కాజీపేట ఫాతిమా సెంటర్ లో కేథడ్రల్ చర్చి అధ్వర్యంలో జరిగిన మదర్ థెరీసా 25వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

నిరుపేదలకు, అనాథలకు మదర్ థెరీసా చేసిన సామాజిక సేవ ఎంతో గొప్పదని అన్నారు. ఎంతోమంది కుష్టురోగులకు, వృద్ధులకు, అనాథలకు, పేదలకు, వ్యాధిగ్రస్తులకు నిస్వార్ధ సేవలందించిన గొప్ప మానవా మూర్తి మదర్‌ థెరిసా అన్నారు. తన జీవితాంతం సామాజికసేవలనే గడిపారన్నారు.

- Advertisement -