మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్

70
santhosh shobhan
- Advertisement -

గోల్కొండ హై స్కూల్’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు సంతోష్ శోభన్. తర్వాత తను నేను. ‘ఏక్ మినీ క‌థ’ చిత్రంతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న సంతోష్ ఇందులో ఒకటి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా.

తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని ‘లైక్ షేర్ అండ్ స‌బ్‌స్రైబ్‘ అనే టైటిల్‌ను ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్‌ను రివీల్ చేశారు. ఈ పోస్ట‌ర్ సంతోష్ శోభ‌న్, ఫ‌రియా అబ్దుల్లా, సుద‌ర్శ‌న్ ముగ్గురు పైకి చూస్తూ కెమెరాకు ఫోజులిస్తున్నారు.

ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నాడు. అడ్వేంచ‌ర‌స్ ట్రావెల్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -