తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. నాంపల్లి టీఎన్‌జీవో భవన్ వద్ద ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగాయి. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
ఉద్యోగులు టీఆర్‌ఎస్‌కు అనుకూలమని మాట్లాడారని ఆరోపించారు ఉద్యోగ సంఘాల నేతలు. వివిధ కార్యాలయాల నుంచి ర్యాలీగా టీఎన్జీవో భవన్‌కు ఉద్యోగులు వచ్చారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఉద్యోగుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకోమన్నారు. తాము ఇన్‌కం టాక్స్ స్లాబ్‌ను పెంచాలని కోరామని, మరి మీరెందుకు చేయలేదని ప్రశ్నించారు.
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఖబర్దార్ బండి సంజయ్. గుట్కా కేసులో అరెస్ట్ అయిన నీకు.. ఉద్యోగ సంఘాలను విమర్శించే అర్హత లేదు. నోరు ఉందని ఇస్తానుసారంగా మాట్లాడితే ఊరుకోబోం. ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలపై అన్యాయంగా కేసులు. ఉద్యోగులకు క్షమాపణ చెప్పకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఖబర్దార్ బండి సంజయ్. గుట్కా కేసులో అరెస్ట్ అయిన నీకు.. ఉద్యోగ సంఘాలను విమర్శించే అర్హత లేదు.
నోరు ఉందని ఇస్తానుసారంగా మాట్లాడితే ఊరుకోబోం. ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలపై అన్యాయంగా కేసులు. ఉద్యోగులకు క్షమాపణ చెప్పకుంటే ఊరుకునేది లేదు. @KTRTRS @trspartyonline pic.twitter.com/Y0PelxYaeT
— V Srinivas Goud (@VSrinivasGoud) October 31, 2022
ఇవి కూడా చదవండి