సుజనాకు షాక్…315 కోట్లు సీజ్‌..!

342
sujana chowdary
- Advertisement -

మాజీ కేంద్రమంత్రి,టీడీపీ నేత సుజనా చౌదరికి ఈడీ షాకిచ్చింది. షెల్ కంపెనీల పేరుతో బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన సుజనా కంపెనీలపై ఈడీ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో 315 కోట్ల ఆస్తులను జప్తుచేసింది. పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ ఆస్తులు, బోగస్ ఇన్వాయిస్‌లతో బోగస్ షెల్ కంపెనీలను సృష్టించి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నారని ఈడీ గుర్తించింది. మహాల్‌ హోటల్‌ అనే షెల్‌ కంపెనీని సృష్టించి దానికి పెద్ద ఎత్తున డబ్బు తరలించారు సుజన. మహల్‌ హోటల్‌ నుంచి వైస్రాయ్‌ హోటల్‌ లిమిటెడ్‌కు నిధులు మళ్లించారనీ గుర్తించింది.
మహల్-వైస్రాయ్ హోటల్‌ మధ్య దాదాపుగా 300 కోట్ల లావాదేవీలు నడిచాయి.

సుజనాచౌదరి ఇప్పటివరకు వివిధ బ్యాంకుల నుంచి రూ.6,000 కోట్ల రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు సమాచారం. బెంగళూరులో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన ఫిర్యాదుతో తీగ లాగితే మొత్తం డొంక కదిలింది. బీసీఈపీఎల్‌ రూ.364 కోట్ల విలువైన రుణాలు తీసుకొని ఎగ్గొట్టిందంటూ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బెంగళూరులో ఫిర్యాదు చేసింది. దీంతో 2010–2013 కాలంలో ఈ సంస్థ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టినట్లుగాసీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. కాగా సుజనాచౌదరి పెద్దమొత్తంలో తీసుకున్న రుణాలు ఎక్కడికి తరలించారు? ఎవరు లబ్ధి పొందారు అనేది ఈడీ తదుపరి విచారణలో తేలాల్సి ఉంది.

- Advertisement -