దుష్ప్రచారాలపై పోలీస్‌లకు సీఈఓ ఫిర్యాదు..

269
rajath kumar
- Advertisement -

కొన్ని రోజులుగా సోషల్​ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై సైబర్​ క్రైమ్​ పోలీసులకు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్​కుమార్ ఫిర్యాదు చేశారు​. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్​నగర్​ జిల్లాలో తన భార్యపేరిట ఇటీవల స్థిరాస్థి కొనుగోలు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు సీఈవో. కావాలని సోషల్ మీడియాలో అవస్తావాలు ప్రసారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై సైబర్ క్రైం పోలీస్ లకు పిర్యాదు చేశాను.

తన భార్య ప్రైవేటు టెలికాం సంస్థలో ఉన్నతస్థాయిలో పనిచేస్తుంది. ఆమెకు సంవత్సరం 40 లక్షల ప్యాకేజ్ ఉంది. పొదుపు చేసిన డబ్బులతో స్థిరాస్థి కొనుగోలు చేసింది, 2014లోనే నా భార్య పేరు మీద భూమి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్​ జరిగిందని ఆధారాలతో సహా రజత్​కుమార్ ఫిర్యాదు చేశారు​. ఎన్నికల ప్రధాన అధికారిగా ఉండి ఒక రాజకీయపార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ వ్యక్తిగత ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారని ఆయన వెల్లడించారు.

ec rajath kumr

కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు తన విధులకు అపార్ధాలు ఆపాదిస్తూ కుటుంబ ప్రతిష్టతను దిగజారుస్తున్నారని రజత్‌కుమార్‌ విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తను చూసి చాలా బాధపడ్డాను. అలాంటి పోస్టింగ్​లతో వ్యక్తిగతంగా తనను, తన కుటుంబాన్ని మానసిక ఆవేదనకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సైబర్​ క్రైమ్​ పోలీసులను కోరారు.

తనకు 15 ఎకరాల 25 గుంటల భూమి ఉన్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే నాకు భూమి ఉంది.. నాకు మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వం భూమి ఇచ్చింది అనేది అవాస్తవం. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రజత్‌కుమార్ అన్నారు.

- Advertisement -