సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి గీతాంజలి..

51
actress

తన ఫోటోతో సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లో ఉపయోగించడంపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది నటి గీతాంజలి. తన ఫోటోలు పెట్టుకొని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. మరే అమ్మాయికి ఇలాంటి ఘటనలు జరగకూడదు….ఒక రంగంలో ఎదుగుతుంటే కొందరు కావాలని ఇలా టార్గెట్ చేస్తారని తెలిపింది.సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను…. పోలీసులపై నాకు నమ్మకం ఉంది….ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

నటి గీతాంజలి సోమవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని హైదరబాద్ సైబర్ క్రైమ్ ఏ సి పి ప్రసాద్ తెలిపారు. కొందరు పోకిరీలు తన ఫోటో ను హాట్ లైవ్ టాక్ డేటింగ్ యాప్ లో పెట్టారని….డేటింగ్ యాప్ లో తన చిత్రాలు పెట్టడంతో తనకు తీవ్రంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిందని ..దీనిపై వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ప్రసాద్.